ధర్మం దాడికి గురైనప్పుడు బలాన్ని నేర్పుతుందంటూ ఆ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్

by I. Sairam |   (  Updated:2025-12-26 07:12:59  IST  )

బద్రీ(Bhadri), జానీ(Johny) వంటి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జంటగా నటించి రేణు దేశాయ్‌(Renu Desai) ప్రేమలో పడింది.

ధర్మం దాడికి గురైనప్పుడు బలాన్ని నేర్పుతుందంటూ ఆ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బద్రీ(Bhadri), జానీ(Johny) వంటి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జంటగా నటించి రేణు దేశాయ్‌(Renu Desai) ప్రేమలో పడింది. అలా కొన్నాళ్లు ఇద్దరు డేటింగ్ చేసిన అనంతరం వారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఒక పాప బాబు ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ మరో పెళ్ళి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతను చూసుకుంటుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం మరో పెళ్లిచేసుకున్నాడు.

ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. అలా దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్స్ స్టార్ట్ చేశారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఇక తాజాగా థియేటర్లలో రిలీజ్ అయిన బ్యాడ్ గర్ల్స్ మూవీలో కీరోల్ ప్లే చేశారు. ఇదిలా ఉంటే.. రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పెట్టిన స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో ‘దుర్గా మాత ధైర్యం నేర్పదు, ధర్మం దాడికి గురైనప్పుడు బలాన్ని నేర్పుతుంది’ అంటూ దుర్గామాత ఉన్న కోట్‌‌ను షేర్ చేసింది. దీంతో ఈ స్టోరీ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఎందుకు రేణు దేశాయ్ ఈ కొటేషన్ పెట్టింది, ఆమెను ఎవరైనా ఇబ్బంది పెట్టారా అంటూ చర్చించుకుంటున్నారు.

Read More..

ఇక నుంచి అలాంటి పాత్రలే చేస్తా.. రీఎంట్రీపై బాలయ్య బ్యూటీ షాకింగ్ రియాక్షన్





Next Story