- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Renu Desai: చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్(Renu Desai) కెరీర్ పీక్స్‌లో ఉండగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్(Renu Desai) కెరీర్ పీక్స్‌లో ఉండగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఆద్య, అకీరా నందన్(Akira Nandan) అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి. అయితే కొద్ది కాలం పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు రావడంతో ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ పిల్లల బాధ్యత తీసుకుని నటనకు దూరం అయింది. మళ్లీ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో సినిమాలు దూరం అయిన ఆమె సోషల్ మీడియాపై పూర్తి ఫోకస్ పెట్టింది. నిత్యం ఏదో ఇక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.
ఇక జంతు ప్రేమికురాలైన ఆమె ఒక ట్రస్ట్‌ను సొంతంగా ప్రారంభించి మూగజీవులకు అండగా ఉంటోంది. అలాగే జంతువులపై ఎవరైనా దాడికి పాల్పడితే వారికి శిక్ష పడేలా చేస్తోంది. ఇక రేణు దేశాయ్ పెట్టే పోస్టులు నిమిషాల్లోనే వైరల్ అవుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో.. తాజాగా, రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా జంతు బలులు తీసుకుంటున్న ఫొటోలు షేర్ చేస్తూ దీని గురించి మీరు ఏం ఆలోచించారు.. మీకు అమాయపకు జంతువులను చిత్రహింసలకు గురి చేసే శక్తి ఉంటే. వాటిని ఎదుర్కొనే శక్తి ఎంత ఉందో చూద్దాం’’ అని రాసుకొచ్చింది. అలాగే జంతువులపై జరుగుతున్న దాడులు, బలి, కోపంతో కొడుతున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.






