ఎప్పటికీ పవన్ కళ్యాణ్ భార్యనే.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..

by Sujitha Rachapalli |

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్ అవుతోంది. పవన్ అభిమాని కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి పెట్టిన ఆమె.. ఇప్పటికీ ఇలాంటి మైండ్ సెట్‌తో ఉండటం దురదృష్టకరమని అభిప్రాయపడింది. ఇంతకీ

ఎప్పటికీ పవన్ కళ్యాణ్ భార్యనే.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..
X

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్ అవుతోంది. పవన్ అభిమాని కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి పెట్టిన ఆమె.. ఇప్పటికీ ఇలాంటి మైండ్ సెట్‌తో ఉండటం దురదృష్టకరమని అభిప్రాయపడింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ పవన్ కళ్యాణ్ అభిమాని ‘నేను ఇప్పుడే మీ అన్ని ఇంటర్వ్యూలు చూశాను. డెఫినెట్‌గా అఖీరా మీ కొడుకే. కానీ ఫ్యాన్స్ మాత్రం ఓజీ మీరు సెపరేట్ కాదనే అనుకుంటాం. మీరు ఇద్దరు భార్యాభర్తలు. మీ లైఫ్ పార్టనర్‌గా మరొకరిని ఊహించలేం. ఫ్యాన్స్ మా అన్నయ్య కొడుకు అంటరు. అవును.. కానీ అన్నయ్య అంటే అందులో మీరు కూడా ఉన్నట్లే. పురుషుడు ఒక్కడే కొడుకుకు జన్మనివ్వలేరు కదా. సో.. మీరు ఎప్పుటికీ మా దేవుడు పవన్ కళ్యాణ్ భార్యనే. మా వదిన కూడా. మేము ఎప్పటికీ మీకు అలాంటి గౌరవం ఇస్తాం’ అని రాసుకొచ్చాడు.

దీంతో చిర్రెత్తిపోయిన రేణూ దేశాయ్.. 2025లో కూడా ఇలాంటి పితృస్వామ్య ఆలోచనలతో బతుకుతున్నామని క్లాస్ పీకింది. ఒక అమ్మాయి తండ్రి లేదంటే భర్త ప్రాపర్టీనేనా? ఆమెకంటూ సొంత ఆలోచనలు, స్వాతంత్ర్యం ఉండకూడదా అని ప్రశ్నించింది. ఇప్పటికీ అమ్మాయి జాబ్ చేయాలంటే పర్మిషన్ అడగాలి.. చాలా మంది మగాళ్లు భార్య ప్లేస్ ఇంట్లో కిచెన్, పిల్లలను కనడమే అనుకుంటున్నారు.. ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా తన వాయిస్ వినిపిస్తున్నానని.. అమ్మాయిగా పుట్టినందుకు కడుపులోనే లేదా పరువు హత్య లేదా వరకట్న వేధింపులకు బలికాకుండా ఉండాలని కోరుకుందామని పోస్ట్ పెట్టింది.

Next Story