Renu Desai: ‘ప్రేమే అన్నీ ఇస్తుంది.. తీసుకుంటుంది’.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

by Kodari Anjali |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Renu Desai: ‘ప్రేమే అన్నీ ఇస్తుంది.. తీసుకుంటుంది’.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతలు చూసుకుంటూ హ్యాపీగా గడుపుతోంది. పిల్లల కోరిక మేరకు మాజీ భర్త వద్దకు పంపిస్తూ.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. ఇక రేణు దేశాయ్ అండ్ పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించే క్రమంలో ప్రేమలో పడి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

వీరి ప్రేమకు చిహ్నంగా అకీరా నందర్ (Akira Nandar), ఆద్య (Adya) లు జన్మించారు. ప్రస్తుతం పిల్లల్ని రేణు దేశాయ్ చదివిపిస్తుంది. త్వరలో అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు అనేకం వినిపిస్తున్నాయి. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. జూనియర్ పవర్ స్టార్ కోసం ఈగర్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘జీవితాన్ని వెనుకకు అర్థం చేసుకోవాలని తత్వవేత్తలు చెప్పినట్లుగా ఇది పూర్తిగా నిజం. కానీ వారు దానిని ముందుకు జీవించాలనే మరొక ప్రతిపాదనను మరచిపోతారు. ~సోరెన్ కీర్కెగార్డ్’’ అంటూ రాసుకొచ్చింది. అలాగే తను వీడియోలో తన ఫొటోలు పంచుకుని.. ‘ప్రేమే అన్నీ ఇస్తుంది.. తీసుకుంటుంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక రేణు దేశాయ్ చివరగా మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో రేణు దేశాయ్ హేమావతి లవణం (HEMAVATHI LAVANAM ) రోల్ లో కనిపించింది. సామాజిక పరిస్థితుల చక్కదిద్దే పవర్ ఫుల్ రోల్‌లో కనిపించి.. రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది.

Next Story