- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను కాపాడేందుకు నాకెవ్వరూ లేరు : రేణు దేశాయ్ మరో పోస్ట్ వైరల్
by Naga Rani Yarlagadda |
తనను కాపాడేందుకు తనకు తండ్రి, అన్న, భర్త ఎవరూ లేరంటూ నటి రేణూ దేశాయ్ మరో పోస్ట్ పెట్టారు. నిన్నటి నుంచి తనపై చాలా విమర్శలు వస్తున్నాయని, కానీ ఎవరి కామెంట్స్ పైనా స్పందించేందుకు తాను సిద్ధంగా లేనని, స్పందించబోనని స్పష్టం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తనను కాపాడేందుకు తనకు తండ్రి, అన్న, భర్త ఎవరూ లేరంటూ నటి రేణూ దేశాయ్ మరో పోస్ట్ పెట్టారు. నిన్నటి నుంచి తనపై చాలా విమర్శలు వస్తున్నాయని, కానీ ఎవరి కామెంట్స్ పైనా స్పందించేందుకు తాను సిద్ధంగా లేనని, స్పందించబోనని స్పష్టం చేశారు. వీధికుక్కలను చంపేయడంపై నిన్న మీడియా ముందు చేసిన కామెంట్స్ తీవ్రదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఈ పోస్ట్ చేశారు. తన తప్పు లేకపోయినా చాలామంది తనను విమర్శిస్తున్నారని వాపోయారు. తాను నమ్మే దేవుడికే తన బాధను చెప్పుకుంటానని, ఆయన తన బాధను వింటాడన్న నమ్మకం ఉందన్నారు. తరచూ తాను కాశీ ఎందుకు వెళ్తానో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని ఆ పోస్ట్ కింద రాసుకొచ్చారు. వీధి కుక్కల విషయంలో తన పోరాటం ఆపనని కూడా స్పష్టం చేశారు.
Next Story






