- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఆదర్శ కుటుంబం' కోసం రీమిక్స్ సాంగ్?
ఆదర్శ కుటుంబం సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్‌ను పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ విజయానంతరం విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం (ఏకే 47) చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సినిమా టైటిల్ చూసి ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మొదట ప్రేక్షకులు భావించారు. అయితే ఇందులో కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించనుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మితమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్‌ను పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, అది వెంకటేష్ పాత సినిమాల్లోని పాట అని టాక్ వినిపిస్తోంది. ఇటీవల రీమిక్స్ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆదర్శ కుటుంబంలో ఏ పాటను రీమిక్స్ చేస్తారోనని వెంకటేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో కొనసాగుతోంది. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోకి ప్రధాన బలం అయిన కామెడీ ఈ మూవీలో కూడా పుష్కలంగా ఉండబోతున్నట్లు సమాచారం. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తర్వాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోలో రానున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






