ప్రీతి అస్రాని సినిమా రిలీజ్ డేట్ అప్డేట్.. ప్రతి రంగు ఒక కథను చెబుతుందంటూ వీడియో రిలీజ్

by Chukka Sudharani |

ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నిరమ్’ రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేశారు మేకర్స్.

ప్రీతి అస్రాని సినిమా రిలీజ్ డేట్ అప్డేట్.. ప్రతి రంగు ఒక కథను చెబుతుందంటూ వీడియో రిలీజ్
X

దిశ, సినిమా: గతేడాది ‘కిస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరోయిన్ ప్రీతి అస్రాని.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ఈ అమ్మడు చేతిలో ఉన్న ప్రాజెక్టులలో ‘నిరమ్’ ఒకటి. క్రిష్ణ బలరాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని స్క్వేర్ సినిమాస్ బ్యానర్‌పై రెండో ప్రాజెక్టుగా రూపొందుతోంది. ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ముగెన్ రావు హీరోగా నటిస్తుండగా.. ప్రీతి అస్రానితో పాటు తాన్యా హోప్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా రిలీజ్ డేట్ అప్డేట్ పంచుకుంది ప్రీతి. ఈ మేరకు ‘ప్రతి రంగు ఒక కథను చెబుతుంది.. ఈ ఆగస్టులో దానిని చూసే సమయం ఆసన్నమైంది’ అనే క్యాప్షన్‌తో ఓ స్పెషల్ వీడియో పంచుకున్నారు. అందులో నటీనటుల మాస్కులు, వాటి వెనుక ఉన్న అసలు నిజాలు అనే ఉద్దేశ్యం వచ్చేలా షేర్ చేసిన ఈ వీడియాలో ఈ ఏడాది ఆగస్టులో ‘నిరమ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతున్నది అని ప్రకటించారు. కానీ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతున్నది.

Next Story