వెండితెరకు హీరోగా డైరెక్టర్ ఎంట్రీ.. సినిమా రిలీజ్ డేట్

by Chukka Sudharani |

‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’ లాంటి చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

వెండితెరకు హీరోగా డైరెక్టర్ ఎంట్రీ.. సినిమా రిలీజ్ డేట్
X

దిశ, సినిమా: ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’ లాంటి చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ‘డిసి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్నఈ చిత్రాన్ని గతేడాదే అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘వెండితెరపై సందడి చేయడానికి దేవదాస్ అండ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు..! జులై 31న ప్రపంచవ్యాప్తంగా డిసి విడుదల కానుంది’ అంటూ పోస్టర్‌ను షేర్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. డైరెక్టర్‌గా స్క్రీన్ ప్రజెంట్స్‌తో తనను తాను నిరూపించుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story