Regina Cassandra : ఆ ఫుడ్ తీసుకుని కూడా ఇంత స్లిమ్‌గా ఉంటుందా.. అదెలా సాధ్యం

by Pulgam srinivas |

రెజీనా తాజాగా తన డైట్ గురించి మాట్లాడుతూ... రైస్ లేనిదే ముద్ద దిగదు. కచ్చితంగా రోజువారీ ఆహారంలో నాకు రైస్ ఉండాల్సిందే. అన్నం ఎంత తిన్నా అది కరిగించడం కోసం వ్యాయామం చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

Regina Cassandra : ఆ ఫుడ్ తీసుకుని కూడా ఇంత స్లిమ్‌గా ఉంటుందా.. అదెలా సాధ్యం
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగాలంటే ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. అద్భుతమైన నటన ఉన్నా కూడా సరైన ఫిట్నెస్ లేనట్లయితే వారికి అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. దానితో హీరోయిన్లు తమ బరువును కంట్రోల్లో ఉంచుకోవడం కోసం, ఫిట్ గా ఉండడం కోసం అనేక కసరత్తులు చేస్తారు, అలాగే ఫుడ్ తినే విషయంలో కూడా ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం హీరోయిన్లు ఫ్యాట్ ఫుడ్ కు చాలా దూరంగా ఉంటారు.

మరి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఉన్న వంటకాలను దూరం పెడతారు. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ను ఇష్టంగా తింటుందట, కానీ ఆమె ఇప్పటికీ ఎంతో ఫిట్ గా ఉంటూ స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఆ నటి ఎవరు అనుకుంటున్నారా..? ఆమె మరెవరో కాదు.. రెజీనా కాసాండ్రా. శివ మనసులో శృతి (SMS) సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ చిన్నది చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం కూడా ఈమె మంచి దశలోనే కెరీర్ను ముందుకు సాగిస్తుంది.

తాజాగా ఈమె తన ఫుడ్ డైట్ గురించి క్లియర్గా తెలియజేసింది. తనకు సౌత్ వంటకాలు అంటే చాలా ఇష్టం అని, అందులో ముఖ్యంగా రైస్ లేకుంటే భోజనం సంతృప్తి కాదు అని తెలియజేసింది. నేను పక్కా రైస్ లవర్ ని, రోజులో కనీసం కొద్దిపాటి అన్నం అయినా తినాల్సిందే. పప్పు అన్నం, రసం అన్నం, ఇలా ఏదో ఒక రకంగా రోజు నేను తీసుకునే ఆహారంలో రైస్ కచ్చితంగా ఉంటుంది. అది లేకపోతే నా భోజనం అసంతృప్తిగా అనిపిస్తుంది అని చెప్పింది. రైస్ ఎక్కువగా తీసుకున్నప్పటికీ అందుకు తగిన వ్యాయామాలు చేసి మళ్లీ ఫిట్గా ఉంటాను అని రెజీనా చెప్పుకొచ్చింది.

Next Story