- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Regina: దిమ్మతిరిగే క్యాప్షన్‌తో సాయి ధరమ్ తేజ్ బ్యూటీ సెన్సేషనల్ పోస్ట్
టాలీవుడ్ ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా (Regina Cassandra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా (Regina Cassandra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కెరీర్ మొదట్లో ఎందరో టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ బ్యూటీ 2019 లో ఏక్ లత్కీ కో దేకా దో (Ek latki ko deka do) చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే తమిళంలో ఈ బ్యూటీ నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా.. టాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ నటించిన సినిమాలు భారీ సక్సెస్ అందుకున్నాయి.
అయితే రెజీనా కసాండ్రా 14 ఏళ్ల వయస్సులోనే నటుడు ప్రసన్న(Prasanna), లైలా (Laila)జంటగా నటించిన తమిళ్ మూవీ కంద నాన్ మూ (Kanda Nan Moo) లో లైలా సోదరిగా నటించి.. ఆ వయస్సులోనే నెటిజన్ల మనస్సు దోచుకుంది. అలాగే 2012 లో టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ శివ మనసుల శ్రుతి (Shiva Manasula Shruti) మూవీతో అడుగుపెట్టింది. ఈ మూవీకి రెజీనాకు మొదటిసారిగా ఉత్తమ నటిగా అవార్డు రావడం విశేషమని చెప్పుకోవచ్చు.
తెలుగులో ఈ బ్యూటీ రొటీన్ లవ్ స్టోరీ (Routine Love Story), కొత్త జంట (New Couple), పిల్ల నువ్వు లేని జీవితం(Pilla nuvvu leni jivitam), పవర్ (Power), రారా...కృష్ణయ్య (Rara...Krishnaiah), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (Subrahmanyam For Sale), శంకర (Shankara), 1945, ఆచార్య (Acharya), శాకిని డాకిని (Sakini Dakini), కార్తీక (Karthika) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. స్టైలిష్ డ్రెస్ ధరించి అదిరిపోయే ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలకు రెజీనా ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ‘‘మీరు ఇబ్బంది కోసం చూస్తున్నట్లయితే, నా ముఖం వైపు చూడు’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.






