- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయనతారా ‘మహాశక్తి’లో రెజీనా.. స్పెషల్ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
నయనతారా అమ్మోరు పాత్రలో నటించిన చిత్రం ‘అమ్మోరు తల్లి’.

దిశ, సినిమా: నయనతారా అమ్మోరు పాత్రలో నటించిన చిత్రం ‘అమ్మోరు తల్లి’. మొదట తమిళంలో ‘మూకుతి అమ్మన్’ అనే పేరుతో రిలీజైన ఈ చిత్రం.. తెలుగులో అమ్మోరు తల్లిగా వచ్చింది. దీనికి ఆర్‌జే బాలాజీ దర్వకత్వం వహిస్తూ.. కీలక పాత్ర పోషించాడు. ఊర్వశీ, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2020 వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అలాంటి ఈమూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్రకటించారు చిత్ర బృందం. తమిళంలో ‘మూకుతి అమ్మన్2’గా తెరకెక్కబోతున్న ఈ మూవీ తెలుగులో ‘మహాశక్తి’గా రాబోతున్నట్లు ప్రకటించారు. అలాగే.. పండుగ స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ రెజీనా కాసాండ్రా కూడా ప్రధాన పాత్రలో నటించబోతుంది. ఈ విషయాన్ని అమ్మడు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘మూకుతి అమ్మన్2 మొదటి దర్శనం ఇదిగో’ అంటూ అప్డేట్ ఇచ్చింది. దీంతో మహాశక్తి సినిమాలో రెజీనా కూడా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అవ్వడంతో నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. లింక్






