- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధ్యతలన్నీ మగాడిపైనే వేయొద్దు.. రెజీనా సంచలన కామెంట్స్
బ్యూటిపుల్ రెజీనా భాగస్వామి బాధ్యతల గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూనే రియాలిటీ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

దిశ, సినిమా : బ్యూటిపుల్ రెజీనా భాగస్వామి బాధ్యతల గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూనే రియాలిటీ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె.. రిలేషన్‌లో ఉన్నప్పుడు అమ్మాయి, అబ్బాయి ఎలా నడుచుకోవాలో తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘నువ్వే అన్నీ చేయాలంటూ అమ్మాయిలు పార్ట్‌నర్ మీద ఒత్తిడి పెట్టడం తప్పు. ఇది అన్యాయం.
మెంటల్ హెల్త్ ముఖ్యం. ఒకరి మానసిక ఆరోగ్యం బాగోలేకపోతే, మరొకరు అన్ని బాధ్యతలు ఒక్కడే భరించాలని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. దీన్ని రెండు వైపులా అర్థం చేసుకోవాలి. పార్టనర్ మెజీషియన్ కాదు. లైఫ్‌లో వాళ్లకి చాలా ఇష్యూస్ ఉంటాయి. వాళ్లకీ వాళ్ల సమస్యలు, ఒత్తిడి, లిమిటేషన్స్ ఉంటాయి. అందుకే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి, ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవాలి – ఒకరు మాత్రమే అన్నీ భరించాలని అనుకోకూడదు’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.






