Barabar Premista: ఏం పిల్లదాన్ని కన్నావ్ ‘రెడ్డి మామ’ అంటున్న యంగ్ హీరో.. (వీడియో)

by sudharani |
Barabar Premista: ఏం పిల్లదాన్ని కన్నావ్ ‘రెడ్డి మామ’ అంటున్న యంగ్ హీరో.. (వీడియో)
X

దిశ, సినిమా: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premista). ఇందులో మిస్ ఇండియా ఫైనలిస్ట్ (Miss India Finalist) మేఘనా ముఖర్జీ (Meghna Mukherjee) హీరోయిన్‌గా నటిస్తోంది. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు (Posters), టీజర్ (Teaser) ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి.

ఈ క్రమంలోనే తాజాగా ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘రెడ్డి మామ’ (Reddy Mama) సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) రిలీజ్ చేశారు. అంతే కాకుండా ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్ రాజు మెచ్చుకుని చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘ఏం పిల్లదాన్ని కన్నావ్ రెడ్డి మామ..’ అంటూ మాస్ బీట్‌తో సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించారు. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్ఆర్ ధృవణ్ మంచి ఊపున్న బీట్‌ను అందించారు. ఇక త్వరలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న ఈ మూవీలో అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.




Next Story

Most Viewed