‘సన్‌ ఆఫ్ సర్దార్-2’ నుంచి రేబియా పోస్టర్ రిలీజ్.. ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ బ్యూటీ

by I. Sairam |

బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌ణ్(Ajay Devgan) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్-2’ (Son Of Sardaar 2).

‘సన్‌ ఆఫ్ సర్దార్-2’ నుంచి రేబియా పోస్టర్ రిలీజ్.. ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌ణ్(Ajay Devgan) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్-2’ (Son Of Sardaar 2). విజ‌య్ కుమార్ అరోరా(Vijay Kumar Arora) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి(SS Rajamouli) ద‌ర్శ‌క‌త్వంలో సునీల్(Sunil) హీరోగా వ‌చ్చిన మర్యాద రామన్న(Maryada Ramanna) సినిమాను హిందీలో సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar) అని రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ సీక్వెల్‌ను తీసుకువ‌స్తున్నారు మేక‌ర్స్.

ఇప్ప‌టికే ఫ‌స్ట్‌లుక్‌తో పాటు గ్లింప్స్‌, ట్రైలర్ చేసిన చిత్ర‌యూనిట్ తాజాగా మృణాల్ పోస్టర్‌‌తో పాటు మరికొంత మంది యాక్టర్స్ వారు పోషిస్తున్న పాత్రలను రివీల్ చేసింది. అందులో మృణాల్ రేబియాగా, రవి కిషన్ రాజాగా, ముకుల్ దేవ్ టోనీగా, సంజయ్ మిశ్రా బంటు పాండేగా, చున్కీ పాండే దానిష్‌గా, వింద్ దారా సింగ్ టిట్టుగా, శరత్ సక్సేనా రంజిత్ సింగ్‌గా, కుబ్రా సైట్ మెహ్విష్‌గా, నీరు బాజ్వా డింపుల్‌గా, దీపక్ దాబ్రియల్ గుల్‌గా, రోష్నివాలియా సాబాగా, అశ్విని కల్శేకర్ ప్రేమ్‌లతాగా, సాహిల్ మెహతా గొగ్గిగా కనిపించనున్నారు.

ఇక చివరిలో అందరూ ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘ఇది ఫ్యామిలీ ఫొటో కాదు.. బాంబ్ పేలడానికి ముందు తీసుకున్న సీన్’ అని రాసుకొచ్చారు. అయితే ఈ మొత్తం పోస్టర్స్‌లో మృణాల్ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ట్రెడిషనల్ వేర్‌లో చాలా అందంగా కనిపించింది. గోల్డెన్ కలర్ లెహంగా వేసుకుని ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాను జూలై 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

Next Story