ప్ర‌భాస్ హైట్ తో స‌మ‌స్య‌లు.. బాలీవుడ్ హాట్ కామెంట్స్‌..!

by velandi.Saikiran |

రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న బ్రాండ్ అంతా కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ స్థాయిలో ప్రభాస్ కు క్రేజ్ ఉంది.

ప్ర‌భాస్ హైట్ తో స‌మ‌స్య‌లు.. బాలీవుడ్ హాట్ కామెంట్స్‌..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న బ్రాండ్ అంతా కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ స్థాయిలో ప్రభాస్ కు క్రేజ్ ఉంది. జపాన్ లాంటి దేశాల్లో కూడా ప్రభాస్ సినిమాలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. అయితే అలాంటి ప్రభాస్ పై బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన హీరోలలో ప్రభాస్ ఒక్కడే చాలా హైట్ గా ఉంటాడని పేర్కొన్నారు కృతి సనన్.

మిగిలిన హీరోలతో చాలా ఇబ్బందులు పడేవాడిని, అందరూ తనకంటే కాస్త హైట్ తక్కువగానే ఉండేవారని వివరించింది. ప్రభాస్ మాత్రం తనకంటే కాస్త హైట్ ఉండడంతో, తాను ఇబ్బంది పడ్డాను అంటూ వ్యాఖ్యానించారు. ఆది పురుష్‌ సినిమా చేస్తున్న సమయంలో ఈ సమస్య ఏర్పడిందని వివరించింది. కానీ ఇద్దరం అడ్జస్ట్ చేసుకొని యాక్టింగ్ చేసినట్లు పేర్కొంది. అదే సమయంలో మహేష్ బాబు గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతి సనన్.

తాను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలు చూసి పెరిగాను.. కానీ మహేష్ బాబు ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యాడో తెలియదంటూ బాంబు పేల్చింది. అటు నేనొక్కడినే దర్శకుడు సుకుమార్ ను బాగా మెచ్చుకున్నారు. ఆయన డైరెక్షన్ అద్భుతం అంటూ వెల్లడించారు. ఎలాంటి దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పేస్తాడు అంటూ ప్రశంసించారు. అతనితో వర్క్ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు హీరోయిన్ కృతి సనన్.

Next Story