ఈ రాత్రి ప్రేక్షకులకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది.. తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్

by I. Sairam |

మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ రాత్రి ప్రేక్షకులకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది.. తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘ఓదెల-2’(Odela-2) సినిమాతో మనముందుకు వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో మొన్నటి వరకు పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారని, ఒకరి ఫొటోలు మరొకరు డిలీట్ చేసుకున్నారని చాలా రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే వీటిపై వీరిద్దరూ స్పందించలేదు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది తమన్నా. తన లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా తమన్నా తన సామాజిక మాధ్యమాల్లో కొన్ని అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్స్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటికి ‘ఈ రాత్రి ప్రేక్షకులకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story