- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రీ రిలీజ్‌కు రెడీ అయిన రామ్ సూపర్ హిట్ మూవీ.. సేమ్ ఇంపాక్ట్ చూపిస్తుందా?
రామ్ హీరోగా రూపొందిన రెడీ మూవీని మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయబోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చాలా సంవత్సరాల క్రితం 'రెడీ' అనే చిత్రంలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ కమ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించాడు. తమన్నా, నవదీప్ ఈ చిత్రంలో గెస్ట్ పాత్రల్లో నటించగా బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, నాజర్, సునీల్, చంద్రమోహన్, కోటా శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి ముఖ్యపాత్రలలో నటించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిషోర్ నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ 2008వ సంవత్సరంలో విడుదలై ఆ సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మూవీ ద్వారా రామ్, జెనీలియా, శ్రీను వైట్లకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో కొన్నింటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. రామ్ కెరీర్ లో మంచి చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'రెడీ'ని కూడా రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ఏ తేదీన రీ రిలీజ్ చేస్తారో, ఈ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.






