- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వార్తలపై స్పందించిన మిల్క్ బ్యూటీ.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామంటూ సంచలన కామెంట్స్
క్రిప్టో కరెన్సీ (Crypto Currency)లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి పుదుచ్చేరి (Puducherry)లో ఓ కంపెనీ జనాలను నిలువునా ముంచేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టో కరెన్సీ (Crypto Currency)లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి పుదుచ్చేరి (Puducherry)లో ఓ కంపెనీ జనాలను నిలువునా ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 10 మంది నుంచి కంపెనీ నిర్వాహకులు దాదాపు రూ.2.40 కోట్లను వసూలు చేసి ఉడాయించారు. అయితే, బాధితుల్లో ఒకడైన అశోకన్ (Ashokan) అనే రిటైర్డ్ ఉద్యోగి జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించాడు. కాగా, క్రిప్టో కరెన్సీ కంపెనీ (Cryptocurrency Company) 2022లో కోయంబత్తూరు ప్రాంతంలో హెడ్ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఆ కంపెనీ ఓపెనింగ్ సెర్మనీకి ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia)తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కార్యక్రమానికి హాజరయ్యారని, బాధితులు అంతా కంపెనీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అయితే, ఇదే కేసులో ఆర్ధిక నేరానికి పాల్పడ్డారంటూ నితీష్ జెయిన్ (Nitish Jain) (36), అరవింద్ కుమార్ (Arvind Kumar)(40)లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తమన్నా (Tamannaah)ను కూడా పోలీసులు విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేయనున్నారని ఓ వార్త నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ వ్యవహారంపై మిల్క్ బ్యూటీ తమన్నా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘క్రిప్టోకరెన్సీ, సంబంధిత కార్యకలాపాలలో నా ప్రమేయం గురించి పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని నా దృష్టికి వచ్చింది. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. ఈ వార్తలు తప్పుదారి పట్టించేవి. అలాంటి వార్తలపై తగిన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే చర్యలు తీసుకోవడానికి నా టీమ్ కేసును దర్యాప్తు చేస్తోంది. అలాగే మీడియా ఇలాంటి నకిలీ, తప్పుడు పుకార్లు, నివేదికలను స్ప్రెడ్ చేయవద్దు అని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






