ఆ తేదీన '1 నేనొక్కడినే' రీ-రిలీజ్

by Pulgam srinivas |

'1 నేనొక్కడినే' మూవీని మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆ తేదీన 1 నేనొక్కడినే రీ-రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కృతి సనన్ హీరోయిన్‌గా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '1 నేనొక్కడినే'. ఈ మూవీ 2014 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా తారాస్థాయి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ చిత్రం భారీ ఫ్లాప్‌ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాకు ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇలా థియేటర్లలో ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా ఆ తర్వాత మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో రీ-రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీని మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో మహేష్ నటించిన చాలా సినిమాలు రీ-రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి రికార్డులను నెలకొల్పుతుందో తెలుసుకోవాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించారు.

Next Story