- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RC 16: ఊర మాస్ టైటిల్ తో వచ్చేసిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు (Ram Charan) అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. రామ్ చరణ్ బర్త్ డే నేపథ్యంలో RC16 నుంచి

దిశ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు (Ram Charan) అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. రామ్ చరణ్ బర్త్ డే నేపథ్యంలో RC16 నుంచి క్రేజీ అప్డేట్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. నిన్న ప్రకటించినట్లుగానే... ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. అందరూ ఊహించినట్లుగానే ఈ సినిమాకు పెద్ది ( Peddi) అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్ పోస్టర్లో రామ్ చరణ్ ఊర మాస్ యాంగిల్ లో కనిపించాడు.
బీడీ కాల్చుతూ... పాత చిరంజీవిని గుర్తు చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఈ టైటిల్ తో పాటు... ఫస్ట్ లుక్ చూస్తుంటే... పెద్ది సినిమా... మరో గ్యాంగ్ లీడర్ రేంజ్ లో హిట్ అయ్యేలా కనిపిస్తోంది. కాగా రామ్ చరణ్ నటిస్తున్న RC16 సినిమా లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీత స్వరాలు.. అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాకు శివ రాజ్ కుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా... ఇటీవల శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్ లో పెద్దగా నడవకపోయినా ఓటిటిలో మాత్రం... ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.






