రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్టుపై సూపర్ అప్డేట్ ఇచ్చిన సీఈఓ.. కామెంట్స్ వైరల్‌తో ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

రామ్ చరణ్ నటించబోయే ‘RC 17’ షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు మైత్రీ సీఈఓ.

రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్టుపై సూపర్ అప్డేట్ ఇచ్చిన సీఈఓ.. కామెంట్స్ వైరల్‌తో ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ జూన్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా షూటింగ్‌లో వేగం పెంచారు చిత్ర బృందం. ఇక రెండు, మూడు రోజుల్లో షూటింగ్, ఎడిటింగ్ పనులు పూర్తి కావొస్తాయని తెలుస్తుండగా.. ఇంతలోనే తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టేశాడు చర్రి. పెద్ది తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘RC 17’ చేయబోతున్న విషయం తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలోవస్తున్న ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉండగా.. తాజాగా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ‘RC 17’ షూటింగ్ రెగ్యూలర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు మైత్రీ సీఈఓ చెర్రీ తెలిపారు. ప్రజెంట్ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోతుంది.

Next Story