Razakar Movie: " రజాకార్ " మూవీ ఆహా ఓటీటీలో ఎప్పటి నుంచి చూడొచ్చంటే..?

by Phanindra |   (  Updated:2025-07-31 08:27:47  IST  )

Razakar Movie:  రజాకార్  మూవీ ఆహా ఓటీటీలో ఎప్పటి నుంచి చూడొచ్చంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నిజాం సంస్థానం భారత దేశంలో ఎలా విలీనమైందనే కథతో రూపొందించిన మూవీ " రజాకార్ ". గతేడాది మార్చ్ 1న ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై పెద్ద విజయం అందుకుంది. యాట సత్యనారాయణ డైరెక్షన్ లో గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో బాబీ సింహ, మకరంద దేశ్ పాండే, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, అనుశ్రీ.. తదితర నటీ నటులు నటించారు.

ఇన్ని రోజుల తర్వాత రజాకార్ మూవీ ఓటీటీలోకి వస్తుంది. సాధారణంగా ప్రతీ శుక్రవారం రోజున తెలుగులో కొత్త కొత్త సినిమాలు, ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు జనవరి 24 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ మెంబర్స్ అయితే, 48 గంటల ముందే ఈ సినిమాని చూడొచ్చు. థియేటర్స్ లో చూడని వాళ్ళు ఓటీటీలో ఈ శుక్రవారం రోజున చూసేయండి. నిజాం ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం సంస్థానాన్ని ఇండియాలో ఎలా కలిపారనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు.

Next Story