ఆరుగురు హీరోయిన్ల‌తో ర‌వితేజ రొమాన్స్‌..అస‌లు ట్విస్ట్ ఇదే !

by velandi.Saikiran |

కాగా ఇటీవ‌లే మాస్ జాత‌ర సినిమాతో ర‌వితేజ, ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఆరుగురు హీరోయిన్ల‌తో ర‌వితేజ రొమాన్స్‌..అస‌లు ట్విస్ట్ ఇదే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది మాత్రమే, కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వస్తారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మాస్ మహారాజ్ రవితేజ మాత్రమే ఉంటారు. చిన్న చిన్న పాత్రలు చేసిన రవితేజ, ఆ తర్వాత మాస్ మహారాజ్‌గా మారిపోయారు. అయితే ఈ మధ్య కాలంలో వరస డిజాస్టర్లతో రవితేజ సతమతమవుతున్నాడు. అయినప్పటికీ కొత్త దర్శకులకు చాన్స్ ఇస్తూ, ప్రయోగాలు మాత్రం చేయక మానడం లేదు.

ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేస్తున్నాడు రవితేజ. ఇక ప్రస్తుతం భర్త‌ మహాశయులకు విజ్ఞప్తి ( Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈ సినిమా తర్వాత శివా నిర్వాణ‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది.

ఇందులో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ వివరణ ఇచ్చింది చిత్రం బృందం. ఫ్యాన్స్ ఇలాంటి వార్తలను అస్సలు నమ్మకూడదని పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్డేట్లు వచ్చే వరకు, ఫేక్ ప్రచారానికి దూరంగా ఉండాలని కోరింది. కాగా ఇటీవ‌లే మాస్ జాత‌ర సినిమాతో ర‌వితేజ, ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Next Story