- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ravi Teja: భక్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ.. అభిమానులకు సూపర్ ఎక్జైట్మెంట్ ఇచ్చిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘RT76’తో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘RT76’తో బిజీగా ఉన్నాడు. జీ స్టూడియోస్ సమర్పిస్తోండగా.. SLV సినిమాస్ బ్యానర్‌పై సూధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మాస్ మహా రాజా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు.
దర్శకుడు కిషోర్ తిరుమల వాయిస్‌లో ఆలయ ప్రకటనతో స్టార్ట్ అయిన ఈ గ్లింప్స్‌లో.. ఆలయ ప్రకటన గురించి రవితే మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ఆలోచించాను.. గూగుల్, AI అలాగే అందుబాటులో ఉన్నా ప్రతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పటికీ.. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను మరింత కన్‌ఫ్యూజ్ చేశాయి. అందుకే అనుభవం ఉన్న మగాళ్లను ముఖ్యంగా మొగుళ్లను అడిగారు.. వారు షాక్ అయ్యారే తప్పా ఆన్సర్ చెప్పలేదు’ అంటూ రవితేజ తనను తాను రామ సత్యనారాయణగా పరిచయం చేసుకుంటాడు.
ఇక ఈ సంభాషణ మొత్తాన్ని ఎంటర్‌టైన్మెంట్‌గా చూపిస్తూ.. సినిమాకు ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు రివీల్ చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రజెంట్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో రవితేజ, ఆషికా రంగనాథ్ అండ్ డింపుల్ హయాతి కాంబినేషన్‌లో ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. అంతే కాకుండా.. ఈ మూవీ 2026 సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.






