Ravi Teja: రవితేజ ‘మాస్ జాతర’ మే నెలలో లేనట్టే.. కారణం తెలిసి నిరుత్సాహంలో ఫ్యాన్స్!

by Chukka Sudharani |   (  Updated:2025-03-12 14:57:14  IST  )

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఫ్లాప్, హిట్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

Ravi Teja: రవితేజ ‘మాస్ జాతర’ మే నెలలో లేనట్టే.. కారణం తెలిసి నిరుత్సాహంలో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఫ్లాప్, హిట్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘మాస్ జాతర’ (Mass Jatara) ఒకటి. డైరెక్టర్ భాను భోగవరపు (Bhanu Bhogavarapu) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పలు అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్స్‌లోకి రానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) కూడా ఇచ్చింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం అలాగే.. సినిమా రిలీజ్ కోసం ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు రవితేజ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ప్రజెంట్ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటివరకు 75% మాత్రమే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రవితేజ ‘మాస్‌జాతర’ సినిమా మే 9న థియేటర్లలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. అంతే కాకుండా.. మే నెలాఖరు నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని మేకర్స్ చూస్తున్నారట. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మే (May) లాస్ట్ వీక్ (Last Week) లేదా జూన్ ఫస్ట్ వీక్‌ (First Week)లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

READ MORE ...

Arjun S/O Vyjayanthi: ప్రీ-టీజర్‌లో అఫీషియల్ టీజర్ డేట్.. పోస్టర్‌తో హైప్ పెంచేస్తున్న మూవీ టీమ్


Next Story