Ravi Teja: ‘మాస్ జాతర’ మనదే ఇదంతా.. ఆకట్టుకుంటున్న రవితేజ గ్లింప్స్

by Chukka Sudharani |

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ప్రస్తుతం తన 75వ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

Ravi Teja: ‘మాస్ జాతర’ మనదే ఇదంతా.. ఆకట్టుకుంటున్న రవితేజ గ్లింప్స్
X

దిశ, సినిమా: మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ప్రస్తుతం తన 75వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘మాస్ జాతర’ (Mass Jathara) టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara naga vamsi), సాయి సౌజన్య (Sai Sowjanya) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం వచ్చిన ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపిదనే చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో తాజాగా మాస్ మాహారాజ రవితేజ బర్త్‌డే సందర్భంగా (Birthday special) ‘మనదే ఇదంతా.. బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్ (blockbuster comeback) లోడ్ అవుతోంది.. త్వరలో డబుల్ మసాలా (Double masala) దమ్ బిర్యానీ అందిస్తోంది’ అంటూ ‘మాస్ జాతర’ నుంచి గ్లింప్స్ (Glimpses) రిలీజ్ చేశారు చిత్ర బృందం. కేవలం ప్రకటనల కంటెంట్‌తోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా.. తాజాగా వచ్చిన గ్లింప్స్ సినిమాపై మరింత ఎక్స్‌పెక్టేషన్స్ పెంచే విధంగా ఉందంటున్నారు అభిమానులు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్‌టైన్మెంట్‌గా ‘మాస్ జాతర’ గ్లింప్స్ ఉందని సంబరపడతున్నారు. అంతే కాకుండా.. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ, ఎనర్జీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఇందులో కూడా రవితేజ పోలిస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో మరింత ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతూ మూవీ రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story