- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mass Jatara: మాస్ జాతర అప్డేట్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘మాస్ జాతర’ (Mass Jatara).

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘మాస్ జాతర’ (Mass Jatara). యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరకు దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ ఫర్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ‘మాస్ జాతర’ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం ‘మాస్ జాతర’ సాంగ్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. దీని కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. ఈ నెలాఖరు వరకూ ‘మాస్ జాతర’ షూటింగ్ టోటల్ షూట్ కంప్లీట్ అవ్వనుందని సమాచారం. ఇక ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే జూన్ రెండో వారం నుండి #RT #KishoreTirumala కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






