రీ-రిలీజ్‌కి రెడీ అయిన రవితేజ ‘కృష్ణ’

by Pulgam srinivas |

కృష్ణ సినిమాను మే 8న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

రీ-రిలీజ్‌కి రెడీ అయిన రవితేజ ‘కృష్ణ’
X

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ హీరోగా, త్రిష హీరోయిన్‌గా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “కృష్ణ”. 2008లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలను రీ-రిలీజ్ చేసే ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్‌లో విజయవంతమైన చిత్రాలలో ఒకటైన “కృష్ణ” సినిమాను కూడా రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాను మే 8న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. మరి రీ-రిలీజ్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో సాయాజీ షిండే, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, సునీల్, గిరిబాబు, ముకుల్ దేవ్, సుధ, చంద్రమోహన్, కరాటే కళ్యాణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని చక్రి అందించారు. బి. కాశీవిశ్వనాథం, డి.వి.వి. దానయ్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.




Next Story