- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి పీటలెక్కబోతున్న రవితేజ హీరోయిన్.. ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ నుపుర్ సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ నుపుర్ సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా ఆశించినంత హిట్ కానప్పటికీ ఈ భామ అందానికి యూత్ ఫిదా అయ్యారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక ఈ చిన్నది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌కు సొంత చెల్లెలు కావడం విశేషం. ఇదిలా ఉంటే నుపుర్ సనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
తాజాగా నుపుర్ తన సోషల్ మీడియాలో అతని ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫొటోలను షేర్ చేసింది. అంతేకాకుండా వీటికి.. ‘బహుశాలతో నిండిన ప్రపంచంలో, నేను నా సోల్‌ను కనుగొన్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. అయితే వీరి ఎంగేజ్‌మెంట్‌ను కేవలం ఫ్రెండ్స్ సమక్షంలో మాత్రమే జరుపుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. సెలబ్రిటీలు, నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
కాగా నుపుర్ సనన్ గత మూడేళ్లుగా ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌తో ప్రేమలో ఉంది. తాజాగా ఈ జంట తమ ప్రేమను వివాహంతో మరో అడుగు ముందుకు తీసుకెళ్లటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 11న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుందట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నారట. పెళ్లి అనంతరం ముంబయిలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






