పొంగల్ కానుకగా రవితేజ ‘అనార్కలి’ సినిమా

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-05 13:21:06  IST  )

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

పొంగల్ కానుకగా రవితేజ ‘అనార్కలి’ సినిమా
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. హిట్ ఫ్లాప్ అని పట్టించుకోకుండా జెట్ స్పీడ్‌‌లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో ముందు ఉంటున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని రవితేజ తాపత్రయపడుతున్నారు. ప్రస్తుతం ‘మాస్ జాతర’(Mass Jaathara) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనిని భాను భోగవరపు(Bhanu Bhogavarapu) తెరకెక్కిస్తుండగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా 2025 మే నెలలో థియేటర్స్‌లోకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీతో పాటు రవితేజ, కిషోర్ దర్శకత్వంలో ‘RT-76’ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి ‘అనార్కలి’(Anarkali) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘మాస్ జాతర’ అయిపోయాక షూటింగ్ మొదలు కాబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2026 పొంగల్ కానుకగా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే ఇందులోని నటీనటులకు సంబంధించిన వివరాలను కూడా చిత్రబృందం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Next Story