రూటు మార్చిన ఆ ఇద్దరు హీరోలకు నో సక్సెస్.. హిట్ కోసం మళ్లీ ప్రయోగాలు

by Pulgam srinivas |

Raviteja - Ram : మాస్ సినిమాల నుండి దూరంగా వచ్చిన ఈ ఇద్దరికీ హిట్లు మాత్రం దక్కలేదు.

రూటు మార్చిన ఆ ఇద్దరు హీరోలకు నో సక్సెస్.. హిట్ కోసం మళ్లీ ప్రయోగాలు
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఒకే జోనర్ సినిమాలతో వరుసగా ఫ్లాప్స్ దక్కినట్లయితే, జనాలు ఆ నటుడు కేవలం ఒకే రకమైన సినిమాల్లో నటిస్తున్నాడని, వాటిని ఈ తరం యువత పెద్దగా ఇష్టపడడం లేదని, అందుకే సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయని, ఒక్కసారి రూటు మార్చి వేరే జోనర్ సినిమా చేసినట్లయితే ఆ హీరోకి మంచి విజయం దక్కే అవకాశాలు ఉంటాయని అభిప్రాయాలను వ్యక్తం చేయడం సర్వసాధారణమైన విషయం. తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు హీరోలు వరుస పెట్టి మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలలో నటిస్తూ అనేక అపజయాలను సొంతం చేసుకున్నారు.

అలాంటి సమయంలో ప్రేక్షకులు మరియు వారి అభిమానులు కూడా ఒకే రకమైన సినిమాలు చేయడం వల్లే వారికి హిట్ రావడం లేదని, వారు డిఫరెంట్ జోనర్ సినిమాల్లో నటిస్తే మంచి విజయాలను అందుకుంటారని కితాబిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వారు అలా చేసినా కూడా విజయాలు దక్కలేదు. ఇంతకు ఆ హీరోలెవరు అనుకుంటున్నారా? మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఈ ఇద్దరు గత కొంతకాలంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలే చేస్తూ వచ్చారు. వాటితో వీరికి ఫ్లాప్స్ దక్కాయి, దానితో రూట్ మార్చారు.

కొంత కాలం క్రితం రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే క్లాస్ ఎంటర్టైనర్లో నటించాడు. ఈ సినిమా ఈయనకు నిరాశనే మిగిల్చింది. ఇక రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటించాడు. ఈయనకు ఈ సినిమా ద్వారా హిట్ దక్కలేదు. కానీ వీరిద్దరూ మళ్లీ మాస్ మూవీస్ జోలికి వెళ్లడం లేదు. రవితేజ ప్రస్తుతం 'ఇరుముడి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక రామ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వీటితోనైనా వీరికి విజయాలు దక్కుతాయేమో చూడాలి.

Next Story