కూతురు కోసం ఎంత దూరమైనా వెళ్తున్న రవితేజ

by Sujitha Rachapalli |

మాస్ మహారాజా రవితేజ - శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘ఇరుముడి’గా ఫిక్స్ అయినట్లు సమాచారం. కాగా ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

కూతురు కోసం ఎంత దూరమైనా వెళ్తున్న రవితేజ
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ - శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘ఇరుముడి’గా ఫిక్స్ అయినట్లు సమాచారం. కాగా ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. తన కూతురు కోసం ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకునే తండ్రిగా, పెద్ద నాన్నగా కనిపింబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. కాగా ఇంతకు ముందులా కనిపించిన మాస్ అవతార్ కాకుండా కొత్త జానర్‌లో సినిమా ఉంటుందని.. ఓ స్టార్ నటుడు విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ రాసుకున్న కథలో ఎగ్జిక్యూషన్ 20శాతం బాగున్నా మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. కాగా పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. కాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్న రవితేజ.. లైనప్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంది. ఇంతకు ముందులా మాస్ సినిమాలు కాకుండా ఆచితూచి కంటెంట్ సెలెక్ట్ చేస్తున్నాడు.

Next Story