తీన్మార్ స్టెప్పుల‌తో దుమ్ములేపిన‌ ర‌వితేజ‌, దర్శ‌కుడు

by velandi.Saikiran |

దర్శకుడు కిషోర్ తిరుమల, ఇద్దరు హీరోయిన్లతో పాటు రవితేజ కూడా తీన్మార్ స్టెప్పులు వేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

తీన్మార్ స్టెప్పుల‌తో దుమ్ములేపిన‌ ర‌వితేజ‌, దర్శ‌కుడు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తాజాగా న‌టించిన సినిమా భక్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా కొనసాగుతున్నారు. ఎప్పటిలాగే భీమ్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు మెరువనున్నారు. రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి ఇరగదీయనున్నారు.

ఇద్దరమ్మాయిల మధ్య రవితేజ నలిగిపోయిన సంఘటనలను చాలా అద్భుతంగా కిషోర్ తిరుమల తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక జనవరి 13వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా స్టేజ్ పైన దర్శకుడు కిషోర్ తిరుమల, ఇద్దరు హీరోయిన్లతో పాటు రవితేజ కూడా తీన్మార్ స్టెప్పులు వేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Next Story