Ravi Teja: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన రవితేజ.. ఏమైందో అర్థం కాక కంగారు పడుతున్న ఫ్యాన్స్!

by Mallepaka Hamsa |

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.

Ravi Teja: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన రవితేజ.. ఏమైందో అర్థం కాక కంగారు పడుతున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. అదే ఫామ్‌తో గత ఏడాది మిస్టర్ బచ్చన్(Mr. Bachchan), ఈగల్, వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయాయి. హిట్ అందుకోలేక బోల్తా పడ్డాయి. దీంతో రవితేజ తన నెక్ట్స్ సినిమాతో ఎలాగైనా విజయాన్ని సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’(Mass Jatara) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నా ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే ‘మాస్ జాతర’ మూవీ భారీ అంచనాల మధ్య మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీతో పాటు రవితేజ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, రవితేజకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో రవితేజ లుక్ అభిమానులకు షాక్ ఇస్తుంది. మాస్ రాజా ఈ ఫొటోలో గుర్తుపట్టలేనంతగా ఉండి షాక్ ఇచ్చారు. ఈ ఫొటోలో రవితేజ బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారు. అలాగే మొఖంలోనూ తేడా కనిపిస్తుంది. నిద్ర లేచిన వెంటనే దిగిన పిక్ ఇది. ఇక ఈ ఫొటో చూసిన వారంతా ఆయనకు ఏమైంది అసలు ఇలా మారిపోయారని కంగారు పడుతున్నారు. అయితే ఈ ఫొటో ఇప్పటి కాదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం రవితేజకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story