- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగర్ కెనిషాతో రిలేషన్‌షిప్‌పై స్పందించిన రవి మోహన్.. భార్య నిజస్వరూపం బయటపెడుతూ సంచలన ట్వీట్
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్(Ravi Mohan) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్(Ravi Mohan) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన సింగర్ కెనిషా(Kenisha)తో ఓ పెళ్లి వేడుకకు వెళ్లగా.. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. అయితే రవి మోహన్ తన భార్య ఆర్తి(aarthi)కి విడాకుల పంచాయితీ కోర్టులో ఉండగా.. ఆమెతో కనిపించడంతో వీరిద్దరికి సంబంధించిర వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ క్రమంలోనే ఆర్తి కూడా తన పిల్లలను పట్టించుకోకుండా బయటకు గెంటేశాడని పెద్ద నోట్ రిలీజ్ చేయడంతో ఈ విషయం కాస్త నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇక గత వారం నుంచి రవి మోహన్ వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఆయన ట్విట్టర్ ద్వారా ఓ కీలక ప్రకటన విడుదల చేశాడు. ‘‘నా వివాహ బంధాన్ని నేను వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం సానుభూతి కోసం మార్చుకోలేదు. నా జీవితం.. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను.
ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్లు అనిపించింది. చివరకు బయటపడ్డాను. గతంలో నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయాను. అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. దూరంగా వెళ్లాలనేది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు చాలా బరువైన హృదయంతో రాస్తున్నాను. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు నిజాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. ఆర్తి తన పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకుంటోంది. నా నుంచి డబ్బులు పొందడానికి నా పిల్లలను సాధనంగా ఉపయోగించుకోవడం బాధగా ఉంది. ప్లాన్ ప్రకారం పిల్లలకు నన్ను దూరం చేసింది. ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు.
ఇప్పుడు ఏకంగా నా ఛాతిలో కత్తితో పొడిచినందుకు సంతోషంగా ఉంది. అయితే కెనిషా విషయానికొస్తే.. నేను బాధలో మునిగిపోయినప్పుడు తను నన్ను కోలుకునేలా చేయడానికి వచ్చిన మంచి స్నేహితురాలు. నా జీవితం నాశనం అయిన సమయంలో ధైర్యం చెప్పింది. నా చెప్పులు, పర్స్ అన్ని వదిలేసి వెళుతున్న సమయంలో నా పక్కన ఉంది. నేను చట్టపరంగా, భావోద్వేగపరంగా చేస్తున్న పోరాటాన్ని చూసింది. పూర్తి సానుభూతితో నాకు అండగా నిలిచింది. నేను సంతోషంగా ఉండటానికి అర్హుడని కెనిషా నాకు గుర్తు చేసింది. తను నాకు కేవలం మంచి స్నేహితురాలు మాత్రమే. కానీ కొద్ది రోజుల నుంచి పుకార్లు సృష్టిస్తున్నారు. వాటిలో ఎలాంటి నిజం లేదు’’ అని రాసుకొచ్చాడు.






