- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.. ఇలా ఉండడానికి కారణం ఆయనే.. రవి బస్రూర్
రవి బస్రూర్ మాట్లాడుతూ... 18 సంవత్సరాల వయస్సులో రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. రెండోసారి నన్ను రవి అనే వ్యక్తి కాపాడి కీబోర్డు కొనిచ్చి 35 వేల రూపాయలు ఇచ్చాడు. అందుకే నా పేరు ముందు ఆయన పేరును జోడించుకున్నాను అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఓవర్ నైట్లో ఇండియా వ్యాప్తంగా క్రేజ్ను సంపాదించుకున్న సంగీత దర్శకులలో రవి బస్రూర్ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం యాష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజిఎఫ్ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాకి ముందు ఈ సంగీత దర్శకుడికి పెద్దగా గుర్తింపు లేదు. ఎప్పుడైతే ఈ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిందో, ఒక్కసారిగా ఈ మ్యూజిక్ డైరెక్టర్కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుస పెట్టి అనేక భాషల్లో రవి బస్రూర్ కి అవకాశాలు రావడం మొదలయింది.
దాంతో ప్రస్తుతం ఈయన బిజీ సంగీత దర్శకుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన విశ్వక్సేన్ హీరోగా రూపొందుతున్న కల్ట్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్గా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది. టీజర్ విడుదల కార్యక్రమంలో రవి బస్రూర్ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో రవి బస్రూర్ మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఎన్నో విషాద సంఘటనల గురించి తెలియజేశాడు. రవి బస్రూర్ మాట్లాడుతూ... విశ్వక్సేన్ వ్యక్తిత్వం చాలా మంచిది. నేను 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
నా ఇన్ని సంవత్సరాల అనుభవాన్ని ఆయన గుర్తు చేశాడు. విశ్వక్ కి ఎప్పుడు ఏం జరిగినా నేను ఆయనకు తోడు ఉంటాను అన్నాడు. ఈ ఈవెంట్లో తన జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన గురించి ఆయన చెప్పుకొచ్చాడు. నాకు 18 సంవత్సరాల వయసు ఉన్న సమయంలోనే రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. రెండోసారి నన్ను రక్షించిన వ్యక్తి కీబోర్డు కొనివ్వడంతో పాటు 35 వేల రూపాయలు ఇచ్చారు. ఆయన పేరు రవి. అందుకే నా పేరు మొదట ఆయన పేరు వచ్చేలా జోడించుకున్నాను అని రవి బస్రూర్ చెప్పుకొచ్చాడు.






