- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య-46 మూవీలోకి స్టార్ బ్యూటీ ఎంట్రీ.. సంతోషంగా ఉందంటూ టీమ్ పోస్ట్
స్టార్ హీరో సూర్య(Surya), డైరెక్టర్ ఆర్.జే. బాలాజీ(Director RJ Balaji) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’( Karuppu).

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య(Surya), డైరెక్టర్ ఆర్.జే. బాలాజీ(Director RJ Balaji) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’( Karuppu). డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక దీంతో పాటు తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ‘సూర్య-46’ (Surya-46 )అనే వర్కింట్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ చిత్రంలో తాజాగా ఓ స్టార్ బ్యూటీ కూడా యాడ్ అయినట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో రవీన్ టండన్(Raveen Tandon) కూడా భాగం కాబోతున్నట్లు తెలుపుతూ.. ‘ఎవర్ గ్రీన్ రవీన్ టండన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. Suriya46లోకి మిమ్మల్ని చేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీతో ముందు ముందు ఉండబోయే అద్భుతమైన ప్రయాణం కోసం వేచి చూస్తున్నాము’ అని తెలిపారు.






