రష్మిక 'మైసా' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

by Pulgam srinivas |

రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మైసా' టీజర్‌ను ఈ నెల 15న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రష్మిక మైసా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్?
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి రష్మిక మందన్న తన కెరీర్‌లో ఇంతకుముందెన్నడూ కనిపించని మాస్ లుక్‌లో 'మైసా' చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులైంది. చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తైనట్లు సమాచారం. దీంతో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 15వ తేదీన టీజర్‌ను విడుదల చేసే అవకాశముంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో ఒకటి, రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story