వివాదంలో రష్మిక మూవీ రొమాంటిక్ సాంగ్.. కాపీ ఆరోపణలపై మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-21 07:49:39  IST  )

ఇటీవల విడుదలైన రొమాంటిక్ సాంగ్ ‘మషూక’ వివాదాస్పదమవుతోంది.

వివాదంలో రష్మిక మూవీ రొమాంటిక్ సాంగ్.. కాపీ ఆరోపణలపై మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ మూవీ ‘కాక్‌టైల్-2’. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాక్‌టైల్‌కు సీక్వెల్‌గా రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన రొమాంటిక్ సాంగ్ ‘మషూక’ వివాదాస్పదమవుతోంది. ఈ ట్యూన్ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అంతేకాకుండాఈ పాట 1993 నాటి ‘సే సో అరుబాతే ఎ నోన్నా’ అనే ఒక ఇటాలియన్ కామెండీ సాంగ్‌లా ఉందంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా, ఈ వివాదంపై మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న కాపీ ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. తన ప్రతి కొత్త పాట విడుదల కాగానే కొంతమంది కావాలనే స్వయం ప్రకటిత మ్యూజిక్ డిటెక్టివ్‌లు రంగంలోకి దిగుతున్నారని అన్నారు. ఊహజనిత పోలికలు అనే కొత్త జోనర్‌ను సృష్టించి అదే కాపీ సిద్ధాంతాలు పట్టుకుని కూర్చుంటారని ఫైర్ అయ్యారు. నిజం చెప్పాలంటే ప్రస్తానికి తన పీఆర్ టీమ్ పని చేస్తుండటంతో పాటు తన పాటను పబ్లిసిటీ తెస్తున్నారని పేర్కొన్నారు. కానీ నెటిజన్లు చేస్తున్న పని తనకు అస్సలు నచ్చలేదని ఇకనుంచి అయినా ఇలా చేయడం ఆపాలని కోరారు. ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కాపీ వార్తలకు చెక్ పడినట్లు అయింది.

Next Story