Rashmika: పెళ్లి తర్వాత ఇలాంటి లుక్‌లో ఎప్పుడూ చూసి ఉండరు

by Pulgam srinivas |   (  Updated:2026-04-10 13:18:58  IST  )

బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్ షో… రష్మిక అందాలకు ఫ్యాన్స్ ఫిదా.

Rashmika: పెళ్లి తర్వాత ఇలాంటి లుక్‌లో ఎప్పుడూ చూసి ఉండరు
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కన్నడ సినిమాల ద్వారా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, తెలుగు చిత్రాల ద్వారా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా కొనసాగుతోంది. సినిమాల్లో అనేక సందర్భాల్లో గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది, సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

తరచూ స్టైలిష్ మరియు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఆకర్షిస్తోంది. కొంతకాలం క్రితం ఈమె తన తోటి నటుడు అయినటువంటి విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈమె తన సోషల్ మీడియాలో ఎక్కువగా తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చింది.

తాజాగా రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లాక్ డ్రెస్‌ను ధరించి, తన ఎద మరియు ఫ్రంట్, బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది.

ఈ ఫోటోలలో ఈమె కురులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే మెడలో ధరించిన లాకెట్ ఈమె అందాన్ని మరింతగా పెంచింది. ఈ ఫోటోలలో రష్మిక ఎంతో అందంగా కనిపించడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story