Rashmika: స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న రష్మిక-విక్కీ కౌశల్.. ఫొటోలు వైరల్

by Kodari Anjali |

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(National Crush Rashmika) నటించిన తాజా చిత్రం ‘ఛావా’ (Chava) ఈ నెల(ఫిబ్రవరి 14) వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rashmika: స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న రష్మిక-విక్కీ కౌశల్.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(National Crush Rashmika) నటించిన తాజా చిత్రం ‘ఛావా’ (Chava) ఈ నెల(ఫిబ్రవరి 14) వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్(Vicky Kaushal) కథానాయకుడిగా నటించాడు. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఛావా సెన్సార్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫిక్ (U/A Certificate) ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా మొత్తం2. 41 గంటలు ఉండగా.. మూవీలో కొన్ని పదాలు మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. పలు ఛేంజెస్ కూడా సూచింనట్లు సమాచారం. మొఘల్ సామ్రాజ్యాన్ని ఆధారంగా చేసుకుని పలు సన్నివేశాల్లోని పదాల్లో ఛేంజెస్ చేయాలని బోర్డు వెల్లడించింది. ఈ మూవీలో శంభాజీ మహరాజ్‌(Shambhaji Maharaj)గా విక్కీ కౌశల్.. ఈయనకు వైఫ్ గా రష్మిక మందన్న నటించింది. అయితే చావా సినిమా టీమ్ తాజాగా స్వర్ణ టెంపుల్ (Golden Temple) ను సందర్శించుకుంది.

ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం నాడు (ఫిబ్రవరి 10) విక్కీ కౌశల్, రష్మిక పూజ అనంరం అభిమానులతో సందడి చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. సినిమా విడుదలకు ముందే దేవాలయానికి రావడం చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




Next Story