Rashmika Mandanna: అతడితో ఉన్న ఫొటో షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేసిన రష్మిక.. వావ్, సూపర్ అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది.

Rashmika Mandanna: అతడితో ఉన్న ఫొటో షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేసిన రష్మిక.. వావ్, సూపర్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గత ఏడాది ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) చిత్రంతో హిట్ అందుకున్న రష్మిక ఇటీవల ‘ఛావా’ (Chhaava)మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ కావడంతో అదే జోష్‌ను కొనసాగిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్, కుబేర(Kubera) సినిమాల్లో నటిస్తోంది. అలాగే హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) సరసన ‘సికందర్’ మూవీలో జతకట్టనుంది.

ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను సాజిత్ నడిద్వాలా నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), సత్యరాజ్, శర్మన్ జోషి మరియు ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్నటికే ‘సికందర్’ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. అందరిలో ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. అయితే ఈద్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సల్మాన్‌తో ఉన్న ఫొటో షేర్ చేస్తూ ‘సికందర్’(Sikander)అప్డేట్ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ మార్చి 4న విడుదల కాబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఓ ప్రోమో వీడియోను కూడా షేర్ చేసింది. ఇందులో బ్లాక్ అండ్ బ్లాక్ ధరించిన రష్మిక, సల్మాన్ ఓ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. మ్యూజిక్‌తోనే అందరిలో హైప్ పెంచారు. ఇక అది చూసిన నెటిజన్లు వీరిద్దరి కాంబో సూపర్ ఉందని కామెంట్లు చేస్తున్నారు.





Next Story