విజయ్ దేవరకొండతో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేసిన రష్మిక.. ఇది ఎప్పుడూ నాకు ప్రత్యేకమైనదంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by I. Sairam |

రూమర్ కపుల్ విజ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

విజయ్ దేవరకొండతో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేసిన రష్మిక.. ఇది ఎప్పుడూ నాకు ప్రత్యేకమైనదంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రూమర్ కపుల్ విజ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ‘గీత గోవిందం’(Geetha Govindam), ‘డియర్ కామ్రేడ్’(Dear Comrade) వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఆన్ స్క్రీన్ వీళ్ల కెమిస్ట్రీ నచ్చిన ఆడియన్స్ రియల్ లైఫ్‌లో కూడా ఓ కపుల్ అవ్వాలని కోరుకున్నారు. వారు అనుకున్నట్లే ఈ జంట సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అంతేకాదోండోయ్ వీరిద్దరు ఎన్నో చార్లు కలిసి వేకేషన్స్‌కు వెళ్లడం, అక్కడ వీరి ఫొటోస్ మీడియాకు చిక్కడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. కానీ వీరిద్దరి రిలేషన్‌పై ఈ జంట ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమంలో రష్మిక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది.

అందులో గీతా గోవిందం మూవీ షూటింగ్, అండ్ సినిమాలోని కొన్ని ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘7 సంవత్సరాల క్రితం తీసిన ఈ చిత్రాలన్నీ నా దగ్గర ఇంకా ఉన్నాయని నమ్మలేకపోతున్నాను. గోవిందం ఎల్లప్పుడూ అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా ఉంటుంది. ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నేను గుర్తుంచుకుంటున్నాను అండ్ మనమందరం కలిసి చాలా కాలం అయింది.. కానీ వారందరూ చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను.. 7 గీత గోవిందం శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు రియల్ లైఫ్‌లో కూడా మిమ్మల్ని భార్యాభర్తలుగా చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story