- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వివాదస్పద హీరోయిన్ బయోపిక్ లో రష్మిక ?
నటి ప్రత్యూష బయోపిక్ లో రష్మిక నటిస్తే బాగుంటుందని కూడా సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందాన, ఆ తర్వాత గీత గోవిందం సినిమా చేసి సక్సెస్ అందుకుంది. అనంతరం సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప లాంటి సినిమాలు చేసి పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయారు. అటు హిందీలో యానిమల్ సినిమా చేసి ఇండస్ట్రీని షేక్ చేశారు రష్మిక.
అలాంటి రష్మిక ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. ఈ సినిమాకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక త్వరలో మరోసారి వెంకీ కుడుముల దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారట రష్మిక. అలాంటి రష్మిక ఓ బయోపిక్ లో నటించేందుకు సిద్ధమైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దివంగత నటి ప్రత్యూష బయోపిక్ లో రష్మిక మందాన నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మేరకు ఓ దర్శకుడు చర్చలు జరుపుతున్నారట. అన్ని ఓకే అయితే త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇది ఇలా ఉండగా 2002 సంవత్సరంలో నటి ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య చుట్టూ అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె మృతి అప్పట్లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే అలాంటి నటి ప్రత్యూష బయోపిక్ లో రష్మిక నటిస్తే బాగుంటుందని కూడా సినీ విశ్లేషకులు చెబుతున్నారు.






