Rashmika Mandanna: నన్ను క్షమించండి ఈ సారి చేయలేకపోయానంటూ రష్మిక మందన్న పోస్ట్.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా రష్మిక మందన్న(Rashmika Mandanna) బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది.

Rashmika Mandanna: నన్ను క్షమించండి ఈ సారి చేయలేకపోయానంటూ రష్మిక మందన్న పోస్ట్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా రష్మిక మందన్న(Rashmika Mandanna) బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది. తన క్రేజ్‌ను పెంచుకుంటూ పలు యాడ్స్ కూడా చేస్తోంది. ఈ అమ్మడు ఇటీవల ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) సరసన నటించిన ‘ఛావా’(Chhaava) చిత్రం కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ సినిమాను మార్చి 7న టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రజెంట్ రష్మిక మందన్న కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend)వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, ఓ నటికి సారీ చెప్తూ రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. రష్మిక మందన్న బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ కంపెనీలలో ఒనిట్సుకా టైగర్ ఒకటి. ఇండియాలో ఆ బ్రాండ్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ప్రతీ ఏడాది ఫోటో షూట్స్ చేస్తుంది. అయితే ఈసారి ఒనిట్సుకా టైగర్ ను బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీ ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఫొటోలు షేర్ చేయడంతో.. రష్మిక రియాక్ట్ అవుతూ.. ‘‘సారీ ఒనిట్సుకా.. ఈ సంవత్సరం చేయలేకపోయాను. అయితే ఈసారి తోటి ఛీర్‌ లీడర్‌, బ్యూటిఫుల్ వామికా గబ్బీ మీతో ఉంది. వామికా.. నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీరు అద్భుతమైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది.

Next Story