- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యారేజ్ రూమర్స్ పై స్పందించిన రష్మిక మందన్న.. షాకింగ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నఈ జంట రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్‌లో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా ఓ పుకారు నెట్టింట షికారు చేస్తుంది. అయితే డేటింగ్, ఎంగేజ్‌మెంట్, పెళ్లి రూమర్స్ పై ఈ జంట ఇప్పటివరకు స్పందించలేదు. కానీ వెకేషన్స్, పండుగలు ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుని దొరికిపోతూ ఉంటారు.
ఈ క్రమంలో రీసెంట్‌గా వీరిద్దరు టర్కీ వెళ్లినప్పుడు కూడా సేమ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో ఈ పుకార్లు మరోసారి జోరందుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్న తన మ్యారేజ్ రూమర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘గత నాలుగేళ్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. నిజమేంటంటే సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే పెళ్లి గురించి స్పందిస్తాను. కానీ కచ్చితంగా ఆ టైమ్‌లో చెబుతాను’ అని చెప్పుకొచ్చింది. అప్పుడు యాంకర్ రష్మిక మనం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా చెప్పవచ్చుగా అని అంటే అప్పుడు రష్మిక ఆఫ్ కెమెరా ఏమైనా అడుగు చెప్తా బట్ ఇక్కడ చెప్పలేను అని అంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






