- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మికకు పెరిగిన క్రేజ్…హీరోలను మించిన రెమ్యునరేషన్!
రష్మికకు పెరిగిన క్రేజ్…హీరోలను మించిన రెమ్యునరేషన్ తీసుకుంటోన్న టాక్.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోయిన్, విజయ్ దేవరకొండ సతీమణి రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రష్మిక, ఆ తర్వాత బడా హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లారు రష్మిక. పెళ్లి తర్వాత కూడా రష్మిక క్రేజ్ క్రమ క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
పెళ్లి తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు రష్మిక. ఈ క్రమంలో పుష్ప ఫ్రాంచైజీతో నార్త్ లో పెరిగిన క్రేజ్ ను ఆమె క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 సినిమాకు హీరోయిన్ రష్మిక ఏకంగా రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టైర్ 2 హీరోల కంటే ఎక్కువ కావడం విశేషం. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.






