Virosh : భర్తను పరిచయం చేసిన రష్మిక.. పెళ్లి ఫొటోలు విడుదల

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-26 13:32:22  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత గ్రాండ్‌‌గా జరిగింది.

Virosh : భర్తను పరిచయం చేసిన రష్మిక.. పెళ్లి ఫొటోలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాల వివాహం(Vijay - Rashmika Wedding) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత గ్రాండ్‌‌గా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు ఈ పెళ్లికి హాజరయ్యారు. తాజాగా రష్మిక పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘నన్ను ప్రేమించే అందరికీ హాయ్.. నా భర్త విజయ్ దేవరకొండను పరిచయం చేస్తున్నాను. నిజమైన ప్రేమ అంటే ఏమిటో నాకు పరిచయం చేసిన వ్యక్తి నా విజయ్. నేను స్వేచ్ఛగా డాన్స్ చేసినా, స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేసినా.. ప్రతి విషయంలోనూ తనకు వెన్నుదన్నుగా నిలిచాడు. విజయ్ వ్యక్తిత్వం గురించి ఒక పుస్తకమే రాయవచ్చు. నా కష్టసుఖాల్లో, విజయాల్లో భాగస్వామిగా ఉంటూ, తన జీవితానికి ఒక పరిపూర్ణ అర్థాన్ని ఇచ్చాడు. ఇకనుంచి విజయ్ భార్యగా పిలిపించుకోబోతున్నాను. ఇందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను. మా ఇద్దరి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ రష్మిక పోస్టు పెట్టారు. దీంతో నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ విష్ చేస్తున్నారు.

Next Story