- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna: అతనితో ఉన్న ఫొటో షేర్ చేసిన రష్మిక మందన్న.. నెటిజన్ల క్రేజీ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఈ క్రమంలో రీసెంట్‌గా కుబేర టీం చెన్నైలో ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. ఆ ఈవెంట్‌లో తాను చాలా ఎంజాయ్ చేశానని ట్వీట్ చేసింది రష్మిక. తన చిన్నతనాన్ని గడిపిన చెన్నైలో ఈ ఈవెంట్ జరగడం ఒకెత్తైతే.. ఈ ఈవెంట్లో కింగ్ నాగ్, ధనుష్‌తో క్యాండిడ్ మూమెంట్స్‌ను పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. అలాగే కొన్ని పిక్స్ కూడా షేర్ చేసింది. అయితే ఓ పిక్ నెట్టింట అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఆ పిక్ స్పెషాలిటీ ఏంటంటే.. కింగ్ నాగార్జున రష్మికకి ఏదో చెబుతుంటే… ఆయాన కాళ్ల దగ్గర కూర్చుని రష్మిక వింటుంది. ఇంత ఎదిగిన కూడా రష్మిక సింప్లిసిటీ.. పెద్దలకు గౌరవించడం చూస్తుంటే తెగ ముచ్చటేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






