Rashmika Mandanna: ‘సికందర్’ భం భం భోలే సాంగ్‌పై రష్మిక మందన్న పోస్ట్..

by Kodari Anjali |

ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss)దర్శకత్వంలో వస్తోన్న సికందర్ (Sikander) సినిమా నుంచి తాజాగా భం భం భోలే సాంగ్ విడుదల అయ్యింది.

Rashmika Mandanna: ‘సికందర్’ భం భం భోలే సాంగ్‌పై రష్మిక మందన్న పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss)దర్శకత్వంలో వస్తోన్న సికందర్ (Sikander) సినిమా నుంచి తాజాగా భం భం భోలే సాంగ్ విడుదల అయ్యింది. హోలీ (Holi) సందర్భంగా చిత్ర బృందం ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crush Rashmika Mandanna), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్లుగా నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటిస్తున్నారు.

అయితే భం భం భోలే సాంగ్ విడుదల అయిన సందర్భంగా రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ సాంగ్‌ను పోస్ట్ చేసి.. ఇలా రాసుకొచ్చింది. భం భం భోలే సాంగ్ రిలీజ్.. మీ కోసమే ఒక చిన్న హోలీ సర్‌ప్రైజ్. సికందర్ షూట్‌లో నా మొదటి రోజు అండ్ పాటపై పని చేస్తున్న నాకు ఇష్టమైన క్షణాలు ఇవి. అంటూ బ్లాక్ కలర్ లవ్ సింబల్ జోడించింది.

అలాగే సల్మాన్ ఖాన్, సాజిద్ నంద్యాల, దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ పేర్లను కూడా జోడించింది. తాజాగా సికందర్ సినిమా నుంచి విడుదలైన సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్షణాల్లో నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫిబ్రవరి 27 వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సికందర్ సినిమా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది.

ఈ మూవీ కోసం నేషనల్ క్రష్ రష్మిక అండ్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్‌ అండ్ బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. పుష్ప రెండు భాగాల్లో తన అద్భుతమైన వీక్షించిన ప్రేక్షకులు రష్మికను పాన్ ఇండియా స్టార్ చేసేశారు. తెలుగు జనాల మనసులో స్టార్ నటిగా నిలిచిపోయింది. అత్యంత పారితోషికం అందుకుంటూన్న నటిగా రష్మిక మందన్న కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు.

Next Story